>

సెక్యూరిటీ హెచ్చరిక: మోసగాళ్లు టివిఎస్ క్రెడిట్ పేరును దుర్వినియోగం చేస్తున్నారు. ఏ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దు లేదా ఎవరికైనా డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయవద్దు. ప్రత్యేక ఆఫర్ల పేజీని చూడడం ద్వారా మా అన్ని ప్రత్యేక ఆఫర్లను ధృవీకరించండి. మీరు ఏవైనా నకిలీ కాల్స్ అందుకుంటే, 1930 కు కాల్ చేయడం ద్వారా లేదా సంచార్ సాథీ పోర్టల్ లేదా యాప్ ద్వారా వాటిని వెంటనే రిపోర్ట్ చేయండి

Hamburger Menu Icon
products image

పత్రికా ప్రకటనలు

ప్రత్యేకమైన సమాచారాలు మరియు ముఖ్యాంశాలను కనుగొనండి

టివిఎస్ క్రెడిట్ పంపిణీలో 12% వృద్ధిని మరియు పిఎటిలో 29% వృద్ధిని నమోదు చేసింది, జూన్ 2025 నాటికి ముగిసిన త్రైమాసికం కోసం ₹181 కోట్ల పిఎటి వృద్ధిని నివేదించింది

ప్రచురణ: టీవీఎస్ క్రెడిట్ తేదీ: 31 | జూలై | 2025

బెంగళూరు, జూలై 30, 2025: భారతదేశం యొక్క ప్రముఖ ఎన్‌బిఎఫ్‌సిలలో ఒకటైన టివిఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్, జూన్ 30, 2025 నాటికి ముగిసిన త్రైమాసికం కోసం దాని ఆడిట్ చేయబడని ఆర్థిక ఫలితాలను ప్రచురించింది. కంపెనీ క్యు1 ఎఫ్‌వై26 కోసం ₹1,697 కోట్ల మొత్తం ఆదాయం, క్యు1 ఎఫ్‌వై25 నుండి 6% వృద్ధి మరియు క్యు1 ఎఫ్‌వై26 కోసం పన్ను తర్వాత నికర లాభం ₹181 కోట్లు, క్యు1 ఎఫ్‌వై25 నుండి 29% వృద్ధిని నివేదించింది. టివిఎస్ క్రెడిట్ క్యు1 ఎఫ్‌వై25 తో పోలిస్తే క్యు1 ఎఫ్‌వై26 లో పంపిణీలలో 12% వృద్ధిని నమోదు చేసింది.

క్యూ1 ఎఫ్‌వై26 ముఖ్యాంశాలు:

  • క్యు1 ఎఫ్‌వై26 నాటికి ఎయుఎం ₹ 26,898 కోట్ల వద్ద ఉంది, క్యు1 ఎఫ్‌వై25 తో పోలిస్తే 2% వృద్ధి.
  • క్యు1 ఎఫ్‌వై26 కోసం మొత్తం ఆదాయం రూ. 1,697 కోట్లు, క్యు1 ఎఫ్‌వై25 తో పోలిస్తే 6% వృద్ధి.
  • క్యు1 ఎఫ్‌వై26 కోసం పన్నుకు ముందు లాభం ₹ 243 కోట్లు, క్యు1 ఎఫ్‌వై25 తో పోలిస్తే 30% వృద్ధి.
  • క్యు1 ఎఫ్‌వై26 కోసం పన్ను తర్వాత నికర లాభం ₹ 181 కోట్లు, క్యు1 ఎఫ్‌వై25 తో పోలిస్తే 29% వృద్ధి.

 

క్యు1 ఎఫ్‌వై26 లో, ప్రోడక్ట్ కేటగిరీలలో రిస్క్‌‌‌ను పరిగణించి వృద్ధి పై దృష్టి సారిస్తూ టివిఎస్ క్రెడిట్ కన్స్యూమర్ ఫైనాన్సింగ్‌లో గణనీయమైన వృద్ధిని సాధించింది. ప్రోడక్ట్ ఆఫరింగ్స్, పంపిణీని విస్తరించడం, కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడం మరియు కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఒక వైవిధ్యమైన పుస్తకాన్ని నిర్మించడానికి కంపెనీ పని చేస్తుంది. ఈ వ్యవధిలో, టివిఎస్ క్రెడిట్ 16 లక్షలకు పైగా కొత్త కస్టమర్లకు లోన్లను పంపిణీ చేసింది, దాని మొత్తం కస్టమర్ బేస్‌ 2 కోట్లకు పైగా చేరింది.

మార్కెట్ షేర్‌ను పెంచడం, ప్రోడక్ట్ ఆఫరింగ్‌లను విస్తరించడం, పంపిణీని విస్తరించడం, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను కొనసాగించడం, కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడం మరియు కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా టివిఎస్ క్రెడిట్ స్థిరమైన వృద్ధి పై దృష్టి పెడుతుంది.

టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ గురించిన పూర్తి వివరాలు:

టివిఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది ఆర్‌బిఐ వద్ద రిజిస్టర్ చేయబడిన భారతదేశం యొక్క ప్రముఖ మరియు వైవిధ్యమైన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలో ఒకటి. భారతదేశ వ్యాప్తంగా 52,300 టచ్ పాయింట్లతో, భారతీయులను పెద్దగా కలలు కనడానికి మరియు వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి సాధికారత కల్పించడం కంపెనీ లక్ష్యంగా కలిగి ఉంది. టివిఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్ కోసం ఒక ముఖ్యమైన ఫైనాన్షియర్‌గా మరియు ప్రముఖ టూ వీలర్, కన్జ్యూమర్ డ్యూరబుల్ మరియు మొబైల్ ఫోన్ ఫైనాన్షియర్లలో ఒకటైన టివిఎస్ క్రెడిట్, యూజ్డ్ కార్ లోన్లు, ట్రాక్టర్ లోన్లు, యూజ్డ్ కమర్షియల్ వెహికల్ లోన్లు మరియు అన్‍సెక్యూర్డ్ లోన్లలో వేగంగా అభివృద్ధి చెందుతున్న గుర్తింపు కలిగి ఉంది. బలమైన కొత్త తరం సాంకేతికతలు మరియు డేటా అనలిటిక్స్ ఆధారంగా నడుస్తున్న, కంపెనీ ఇప్పటి వరకు 2 కోట్లకు పైగా సంతోషకరమైన కస్టమర్లకు సేవలు అందించింది.

మీడియా కాంటాక్టులు:

టీవీఎస్ క్రెడిట్

పాల్ ఎబినెజర్

మొబైల్: +91 7397398709

ఇమెయిల్: paul.ebenezer@tvscredit.com


  • వీటిలో షేర్ చేయండి:‌
  • Share it on Facebook
  • Share it on Twitter
  • Share it on Linkedin

సైన్‍‌అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు

వాట్సాప్

యాప్‍ను డౌన్‌లోడ్ చేయండి

మమ్మల్ని సంప్రదించండి