>

సెక్యూరిటీ హెచ్చరిక: మోసగాళ్లు టివిఎస్ క్రెడిట్ పేరును దుర్వినియోగం చేస్తున్నారు. ఏ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయవద్దు లేదా ఎవరికైనా డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయవద్దు. ప్రత్యేక ఆఫర్ల పేజీని చూడడం ద్వారా మా అన్ని ప్రత్యేక ఆఫర్లను ధృవీకరించండి. మీరు ఏవైనా నకిలీ కాల్స్ అందుకుంటే, 1930 కు కాల్ చేయడం ద్వారా లేదా సంచార్ సాథీ పోర్టల్ లేదా యాప్ ద్వారా వాటిని వెంటనే రిపోర్ట్ చేయండి

Hamburger Menu Icon
products image

పత్రికా ప్రకటనలు

ప్రత్యేకమైన సమాచారాలు మరియు ముఖ్యాంశాలను కనుగొనండి

హెచ్1 ఎఫ్‌వై23 లో పుస్తక విలువలో 25% వృద్ధితో టీవీఎస్ క్రెడిట్ పన్ను తరువాత నికర లాభం రూపంలో ₹179.54 కోట్లు నమోదు చేసింది

ప్రచురణ: టీవీఎస్ క్రెడిట్ తేదీ: 4 | నవంబర్ | 2022

జాతీయం, నవంబర్ 04, 2022: భారతదేశం యొక్క ప్రముఖ ఎన్‌బిఎఫ్‌సి లలో ఒకటి అయిన టివిఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ సెప్టెంబర్ 30, 2022 నాటికి ముగిసిన త్రైమాసికం మరియు అర్ధ-సంవత్సరం కోసం ఆడిట్ చేయబడని ఆర్థిక ఫలితాలను ప్రచురించింది.

హెచ్1 ఎఫ్‌వై23 కోసం ఎన్‌బిఎఫ్‌సి ₹179.54 కోట్ల పన్ను తర్వాత నికర లాభాన్ని నివేదించింది. మార్చ్'22 నాటి ₹13,911 కోట్లతో పోలిస్తే కంపెనీ ఎయుఎం సెప్టెంబర్'22 నాటికి 25% పెరిగి ₹17,448 కోట్లకు చేరింది. క్యు2 ఎఫ్‌వై23 కోసం కంపెనీ త్రైమాసికంలో పన్ను తరువాత లాభం రూపంలో ₹96.24 కోట్లు నివేదించింది.

క్యు2 ఎఫ్‌వై23 ఫలితాల సారాంశం:

• క్యు2 ఎఫ్‌వై22 తో పోలిస్తే 46% పెరిగి పూర్తి ఆదాయం ₹962.34 కోట్లకు చేరింది
• సెప్టెంబర్'22 నాటికి ఎయుఎం ₹17,448 కోట్లుగా ఉంది
• క్యు2 ఎఫ్‌వై22 తో పోలిస్తే ఈ త్రైమాసిక కోసం పన్ను తరువాత నికర లాభం ₹26.41 కోట్ల నుండి 264% పెరిగి ₹96.24 కోట్లకు చేరింది.

పనితీరుపై శ్రీ ఆశీష్ సప్రా, సిఇఒ మాట్లాడుతూ "హెచ్1 ఎఫ్‌వై23లో, మంచి మాన్సూన్ తో పాటు మెరుగైన కస్టమర్ సెంటిమెంట్‌తో మా వ్యాపారం వృద్ధి సాధించింది. క్యు2 ఎఫ్‌వై22 తో పోలిస్తే క్యు2 ఎఫ్‌వై23 లో ట్రాక్టర్ లోన్ పంపిణీ 130% పెరిగింది. మేము హెచ్1 ఎఫ్‌వై23లో 1.6 మిలియన్ + కస్టమర్లను జోడించాము, ఇది మా మొత్తం కస్టమర్ బేస్‌ను 9.4 మిలియన్ + కు చేర్చింది. ఏడు రాష్ట్రాల్లో కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడం ద్వారా మేము కన్జ్యుమర్ లోన్ల వ్యాపారాన్ని పెంచాము. మేము ప్రధానంగా దృష్టి కేంద్రీకరించిన వాటిలో ఒకటైన డిజిటైజేషన్ ద్వారా ఒక గొప్ప కస్టమర్ అనుభవాన్ని అందించడానికి మేము కొత్త సాంకేతికతలను ఉపయోగించడం కొనసాగిస్తున్నాము. టూ-వీలర్ లోన్ వ్యాపారం కోసం కేవలం 2 నిమిషాల్లో లోన్ అప్రూవల్స్ ప్రవేశపెట్టడం మా ఛానల్ భాగస్వాముల విశ్వాసాన్ని పొందడానికి మాకు సహాయపడింది’’.

టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ గురించిన పూర్తి వివరాలు:
టీవీఎస్ క్రెడిట్ సర్వీసెస్ లిమిటెడ్ అనేది ఆర్‌బిఐ వద్ద రిజిస్టర్ చేయబడిన ఒక ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. భారతదేశ వ్యాప్తంగా 31,000 టచ్ పాయింట్లతో, భారతీయులను పెద్దగా కలలు కనడానికి మరియు వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి సాధికారత కల్పించడం కంపెనీ లక్ష్యంగా కలిగి ఉంది. టీవీఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్‌కు అతి పెద్ద ఫైనాన్షియర్‌గా మరియు ప్రముఖ ట్రాక్టర్ ఫైనాన్షియర్లలో ఒకరిగా నిలిచిన టీవీఎస్ క్రెడిట్ యూజ్డ్ కార్ లోన్లు, కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్లు, యూజ్డ్ కమర్షియల్ వెహికల్ లోన్లు మరియు అన్‍సెక్యూర్డ్ లోన్ల విభాగంలో వేగంగా దూసుకెళ్తోంది. అత్యంత అధునాతన సాంకేతికతలు మరియు డేటా విశ్లేషణల ద్వారా సంస్థ దాని 17,000+ ఉద్యోగుల సహాయంతో 9.4 మిలియన్ల కంటే ఎక్కువ కస్టమర్లకు సంతృప్తికరమైన సేవలు అందించింది.

మీడియా కాంటాక్టులు: టీవీఎస్ క్రెడిట్

రుచిక రానా
సీనియర్ మేనేజర్, పబ్లిక్ రిలేషన్స్ మరియు ఇంటర్నల్ కమ్యూనికేషన్స్
మొబైల్: +91 9910036860
ఇమెయిల్: ruchika.rana@tvscredit.com
వెబ్: https://www.tvscredit.com/telugu


  • వీటిలో షేర్ చేయండి:‌
  • Share it on Facebook
  • Share it on Twitter
  • Share it on Linkedin

సైన్‍‌అప్ చేసి పొందండి తాజా అప్‌డేట్లు మరియు ఆఫర్లు

వాట్సాప్

యాప్‍ను డౌన్‌లోడ్ చేయండి

మమ్మల్ని సంప్రదించండి