శ్రీ సుదర్శన్ వేణు U.S లోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుండి మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీలో జెరోమ్ ఫిషర్ ప్రోగ్రామ్‌లో హానర్స్ పట్టా పొందారు. ఈయన పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా మరియు వార్టన్ స్కూల్ నుండి ఎకనామిక్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టాను అందుకున్నారు. ఇంకా, యునైటెడ్ కింగ్డమ్ లోని వార్విక్ విశ్వవిద్యాలయం యొక్క విభాగం అయిన వార్విక్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రూప్ నుండి ఇంటర్నేషనల్ టెక్నాలజీ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. తన మాస్టర్స్ ప్రోగ్రామ్ సమయంలో, శ్రీ సుదర్శన్ వేణు టివిఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్‌లో అనుభవాన్ని పొందారు. టివిఎస్ మోటార్ కార్యకలాపాలను ఆఫ్రికా, ఆసియన్ మరియు లాటిన్ అమెరికా దేశాలలో విస్తరించడానికి ఈయన కీలకంగా వ్యవహరించారు. శ్రీ సుదర్శన్ వేణు ఒక ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ అయిన ఫోర్బ్స్ ఇండియా ద్వారా జెన్నెక్స్ట్ లీడర్ ఆఫ్ ఇండియా ఇంక్గా గుర్తించబడ్డారు. ఈయన ప్రస్తుతం టివిఎస్ మోటార్ కంపెనీ లిమిటెడ్‌కు ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా మరియు టివిఎస్ హోల్డింగ్స్ లిమిటెడ్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు.







